తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా అధ్యక్షులు వీరనారాయణ, ప్రధాన కార్యదర్శి బొడ్డు ఏసుబాబు ఆయనను కలిసి రాజకీయ పరిస్థితులను వివరించారు. అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలపై తీసుకోవాల్సిన ప్రణాళికలను తీన్మార్ మల్లన్న జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు వివరించారు.