ప్రగతి ప్రణాళిక 99 రోజుల రైతుల వారోత్సవాల్లో భాగంగా, విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన కల్పించేందుకు, వానాకాలం సీజన్‌కు ఎరువుల సన్నద్ధతపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 6,59,743 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.