కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి క్రీడా పాఠశాల 4వ తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు మొదలయ్యాయి. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పీడీ పరంధామరెడ్డి తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపిక చేస్తారు.