సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను యాజమాన్యం త్వరితగతిన పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెం శేషగిరిభవన్లో మంగళవారం మాట్లాడుతూ, నూతన సీఎండీ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూనే, కార్మిక సమస్యల పట్ల నిర్లక్ష్యం వీడాలని కోరారు. గత కమిటీ సమావేశాల్లో అంగీకరించిన అంశాలను అమలు చేయాలని, కార్మికులకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో జాప్యం చేయవద్దని ఆయన పేర్కొన్నారు.