కొత్తగూడెం సబ్ స్టేషన్ పరిధిలో 33 కేవీ లైన్ ఏర్పాటు పనుల నిమిత్తం గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ పి. హేమచంద్రబాబు బుధవారం తెలిపారు. మార్వాడీ క్యాంప్, సుతారి బస్తీ, పెనుబల్లి, చాతకొండ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.