ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతున్న కార్మికులపై ప్రభుత్వం అరెస్టులు ప్రయోగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో అన్నారు. స్కీమ్ వర్కర్లు, గ్రామపంచాయతీ, బిల్డింగ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, బిల్డింగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు.