కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సోమవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి పెద్దబోయిన సతీష్ తెలిపారు. ఆదివారం కొత్తగూడెంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాత చట్టాలను రద్దు చేస్తోందని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.