కొత్తగూడెం శేషగిరి భవన్‌లో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ, సింగరేణిలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు.