జిల్లాలోని పలు విద్యాసంస్థల ముందు విక్రయిస్తున్న గుట్కా, సిగరెట్, పాన్ పరాగ్ వివిధ మత్తు ద్రవ్యాలను అరికట్టాలని AIYF నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో గురువారం కొత్తగూడెం డిఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా మాట్లాడుతూ.. జిల్లాలో మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమి కొట్టాలని కోరారు.