జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టరేట్లో బుధవారం సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి అధ్యక్షత వహించనుండగా, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కో-ఛైర్మన్గా పాల్గొంటారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై పథకాల పురోగతిని వివరించాలని కలెక్టర్ అంకిత్ కోరారు.