జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం విడుదల చేసిన ప్రకటనలో, పేకాట, కోడిపందాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశామని పేర్కొన్నారు.