శుక్రవారం రాత్రి కొత్తగూడెంలో పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. పెనుబల్లి బ్రిడ్జి సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28,720 రూపాయల నగదు, రెండు ఆటోలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.