సింగరేణి బొగ్గుగని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. మంగళకొత్తగూడెం శేషగిరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రాజ్‌కుమార్, ఐఎన్‌టీయూసీ నాయకుడు త్యాగరాజన్, సీఐటీయూ నాయకుడు మంద నరసింహారావు తదితరులు ఈ డిమాండ్‌ను వ్యక్తం చేశారు.