కొత్తగూడెం: సాధన గ్రౌండ్ను పట్టించుకోవడం లేదని వినతి

83చూసినవారు
కొత్తగూడెం: సాధన గ్రౌండ్ను పట్టించుకోవడం లేదని వినతి
కొత్తగూడెం టౌన్ రామవరం సాధన గ్రౌండ్ను దాదాపు కోటి రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశామని మాజీ కౌన్సిలర్ మోరే రూపా రమేష్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని విధాల అభివృద్ధి చేశామని, కానీ ప్రస్తుత పాలకులు వాటిని సంరక్షించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు వినతిపత్రం సమర్పించారు. గ్రౌండ్లో లైట్లు వెలగడం లేదని, ఓపెన్ జిమ్ నిర్వహించడం లేదన్నారు.