కొత్తగూడెంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన దేశవ్యాప్త నిరసన దినం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులను నయవంచనకు గురిచేస్తోందని విమర్శించారు. మోదీ విధానాలను ఖండించాలని ఆయన కోరారు.