లక్ష్మీదేవిపల్లి పాలకేంద్రం వద్ద ప్రధానమంత్రి విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్లో అర్హులైన వారికి పూలు అల్లడంపై శిక్షణ కల్పించారు. ఈ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి ప్రధానమంత్రి విశ్వకర్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ ఆకుల నాగేశ్వర్ గౌడ్ మంగళవారం సర్టిఫికెట్లను అందజేశారు. స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం విశ్వకర్మ పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.