లక్ష్మీదేవిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు తల్లి తారమ్మ ఇటీవల మరణించగా, బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ నెల 7న స్వయంగా పరామర్శిస్తానని వారికి ధైర్యం చెప్పారు. అంతకుముందు రేగా కాంతారావు వారి నివాసానికి చేరుకుని తారమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.