లక్ష్మీదేవిపల్లి మండలంలోని మొక్కజొన్న నిల్వ గోడౌనును కలెక్టర్ అంకిత్ మంగళవారం తనిఖీ చేశారు. అన్‌లోడింగ్ ప్రక్రియలో ఆలస్యం జరగకుండా రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించాలని ఆయన ఆదేశించారు. దీనికోసం తగిన లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు హమాలీలను నియమించాలని సూచించారు. గోడౌన్‌లో మొక్కజొన్న నిల్వల అన్‌లోడింగ్ తీరును, బస్తాల భద్రతను ఆయన పరిశీలించారు.