
అమెరికా మంత్రి అత్యుత్సాహం.. కాటేసిన పాము (వీడియో)
అమెరికాలోని ఫ్లోరిడాలో డాక్టర్ ఓజ్ ఇంట్లో రెండు బ్లాక్ రేసర్ జాతి సర్పాలను చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించిన అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీని ఓ పాము కాటేసింది. అదృష్టవశాత్తు అది విషపూరితం కాకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. వన్యప్రాణులపై ఆసక్తి చూపే కెన్నెడీ జూనియర్ గతంలోనూ ఇలాంటి సంఘటనలతో వార్తల్లో నిలిచారు.




