గాంధీనగర్‌లో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం

11చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని 44వ డివిజన్, గాంధీనగర్‌లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7 గంటలకు 'మహా అన్నదానం' కార్యక్రమం జరిగింది. కమిటీ మరియు విశిష్ట అతిథులు గుండు రవికుమార్ దంపతులు ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1500 మందికి పైగా పాల్గొన్నారు. గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉంటాయని కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్