కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం 24వ డివిజన్ బర్మా క్యాంపులో మేడే సందర్భంగా కార్పొరేటర్ పోలమూరి ధనలక్ష్మి జెండా శుక్రవారం ఆవిష్కరించారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న రోజే ఈ మేడే అని ఆమె అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రామికులందరికీ ఆమె మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ యూనియన్ లీడర్ రమణమూర్తి, జక్కుల గట్టయ్య, కిష్టఫర్, రవి కిరణ్, బట్టి శ్రీను, మోహన్, శేషు, కిషోర్, సందీప్, బబ్లు, బన్ని తదితరులు పాల్గొన్నారు.