పాల్వంచ పట్టణంలో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన MD ముబీన్ కుటుంబానికి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం బాధితులను కలిసి, ధైర్యం చెప్పి, రూ.20 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే, ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని కొత్తగూడెం ఆర్డీవోను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా
కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.