ములకలపల్లి మండలం కంపగూడెంలో కూలిపోయిన పాములేరు వాగు వంతెన స్థలాన్ని గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ త్వరలోనే రూ. 5 కోట్ల నిధులతో నూతన వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలపై ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్ అండ్ బీ డీఈ విశ్వనాథ్, ఎస్సై మధు ప్రసాద్, విద్యుత్ శాఖ ఏఈ నరేష్ కుమార్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.