అన్ని దానాల్లో అన్నదానమే గొప్పది.. కొత్వాలశ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. గణపతినవరాత్రులు, నిమజ్జనం అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్వాల శ్రీనివాసరావు మంగళవారం మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్నదానమే గొప్పదని అన్నారు. పాల్వంచలోని కాంట్రాక్టర్స్ కాలనీ, రాహుల్ గాంధీనగర్, పాత పాల్వంచ 46వ డివిజన్లలో ఈ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.