నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న వాహనాలకు జరిమానా విధించినట్లు పాల్వంచ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ డి. భీమ్సంగ్. పాల్వంచ చెక్ పోస్టు వద్ద శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా, సరైన పత్రాలు లేని 12 వాహనాలను తనిఖీ చేసి, జరిమానా విధించడం జరిగిందని ఎంవీఐ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో కానిస్టేబుల్ ఎన్. శివయ్య, తదితరులు పాల్గొన్నారు.