తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి తక్షణమే నివేదికలు పంపాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన సంగం గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సర్వే పూర్తి చేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు.