మొండికట్టకు చెందిన ఓ మహిళకు సంపత్నగర్(టేకులపల్లి)కు చెందిన హరిబాబుతో 2018లో వివాహమైంది. వీరికి బాబు పుట్టాడు. ఆ బాబు తనకు పుట్టలేదని భర్త ఐదు నెలల నుంచి భార్యను వేధిస్తున్నాడు. అత్త తిరుపతమ్మ, ఆడబిడ్డలు స్వరూప, ఎలిశమ్మ, శారద కూడా ప్రోత్సహిస్తుండటంతో బాధితురాలు సోమవారం పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎస్సై సురేశ్ వారిపై కేసు నమోదు చేశారు.