పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను కరకవాగు వద్ద పడేస్తున్నారని, అలాగే దానిని కాల్చడంతో పిల్లలు, పెద్దలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఈ దుర్వాసన, పొగతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని చర్యలు తీసుకోవాలని మంగళవారం పాల్వంచ కమిషనర్ కె. సుజాతకు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీకి కేటాయించిన డంపింగ్ యార్డులోనే చెత్తను పడేయాలని కోరారు.