పాల్వంచ: పాఠ్యాంశాలకే పరిమితం కావొద్దు

1చూసినవారు
పాల్వంచ: పాఠ్యాంశాలకే పరిమితం కావొద్దు
పాల్వంచలో పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంట ర్ప్రెన్యూర్షిప్ బూట్ క్యాంప్ ను కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, బయటి ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమం పాల్వంచ పట్టణంలోని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్