ఏప్రిల్ మొదటివారంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఖేలో
ఇండియా గిరిజన క్రీడల్లో పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సపావత్ దత్తు 110 మీటర్ల హర్డిల్స్‌లో 16.00 సెకన్ల టైమింగ్‌తో రజత పతకం సాధించారు. ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న దత్తు, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం 'లక్ష్య' అథ్లెట్. అతని ప్రతిభకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందనలు తెలిపారు.