పాల్వంచ: 395 అడుగులకు చేరిన కిన్నెరసాని

72చూసినవారు
పాల్వంచ: 395 అడుగులకు చేరిన కిన్నెరసాని
కిన్నెరసాని జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లో గత వానాకాలంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. కాగా, శనివారం నాటికి 395. 60 అడుగులకు తగ్గిందని డ్యామ్ సైడ్ ఇంజనీర్ తెలిపారు. రిజర్వాయర్ నుంచి ప్రతిరోజు 100 క్యూసెక్కులకు పైగా నీరు బయటకు వెళుతోంది. ఇందులో కేటీపీఎస్ కర్మాగారానికి 75 నుంచి 80 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్