పాల్వంచ కిన్నెరసాని టూరిజం పదేళ్లుగా నత్తనడకే!

51చూసినవారు
పాల్వంచ కిన్నెరసాని టూరిజం పదేళ్లుగా నత్తనడకే!
పాల్వంచలోని కిన్నెరసాని అద్దాల మేడ మరియు కొత్తగూడెంలోని హరిత హోటల్ నిర్మాణ పనులు పదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. రూ. 23 కోట్లతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులు నిధులున్నా అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పూర్తి కావట్లేదు. గతేడాది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, ఆరు నెలలు దాటినా పురోగతి లేదు. పర్యాటకులు మాత్రం అధికారులు వేగంగా స్పందించి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్