పాల్వంచ: రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలు పరిష్కారం

60చూసినవారు
పాల్వంచ: రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలు పరిష్కారం
పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసిందని, ధరణి పోర్టల్ వలన రైతులు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని, రైతులను ఆదుకునేందుకే భూభారతి పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలు పరిష్కారమవుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్