పాల్వంచ నవ భారత్‌కు FTCCI ఎక్సలెన్స్ అవార్డు

పాల్వంచ నవ భారత్ నవ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మక ‘FTCCI ఎక్సలెన్స్ అవార్డు’ దక్కింది. సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్యం, విద్య, జీవనోపాధి రంగాల్లో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు వైస్ ప్రెసిడెంట్, రేర్ అడ్మిరల్ ఎల్‌వీ శరత్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 9న అవార్డు అందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
