పాల్వంచ: కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

4చూసినవారు
పాల్వంచ: కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి
పాల్వంచ మండలం దంతెలబోర గ్రామ సమీపంలో కోడి పందాల స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరొకరు తప్పించుకున్నారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ. 39,450 నగదు, ఆరు కోడి పుంజులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణను టాస్క్ఫోర్స్ పోలీసులు రూరల్ పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్