పాల్వంచ మండలంలోని పాండురంగాపురం శివారు జామాయిల్ తోటలో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 26,040 నగదు, ఏడు సెల్ఫోన్లు, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు ఎస్ఐ బి. సురేశ్ తన సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.