భారత రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించుకుందాం అని సీపీఐ జాతీయ సమితి పిలుపునిచ్చింది. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి వరకు వారు నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా శనివారం పాల్వంచ చండ్ర రాజేశ్వరరావు భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. మూడోసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాలు విమర్శించారు.