పాల్వంచ సమీపంలోని నవభారత్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని, ఎస్పీ క్యాంప్ కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడిన ఎస్పీ గారు, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.