పాల్వంచలో పాండురంగాపురం తండాకు చెందిన బానోతు హిందు (22) అనే డిగ్రీ విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి తులసీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.