పాల్వంచ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు, ఆల్ ఇండియా జాక్టో పిలుపు మేరకు, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను కేంద్రం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.