పాల్వంచలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

11చూసినవారు
పాల్వంచలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా కాలనీలోని బ్రహ్మంగారి దేవాలయం ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు. ఈ వేడుకలను పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ బ్రహ్మం, మెగా ఫాన్స్ అధ్యక్షుడు ఖాసీం పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్