ప్రైవేట్‌ పాఠశాలపై చర్యలు కోరుతూ కలెక్టర్‌కు వినతి

1251చూసినవారు
ప్రైవేట్‌ పాఠశాలపై చర్యలు కోరుతూ కలెక్టర్‌కు వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఐదో షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం సేవాలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ, విద్యాశాఖ అధికారులు పాఠశాలలో సోదాలు నిర్వహించగా అక్రమంగా నిల్వ చేసిన వర్క్ బుక్స్ బయటపడ్డాయని, పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్