భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో ఆదివారం18వ డివిజన్ రామాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని 18వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ మరియు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ముంతాజ్, హల్పర్స్ భాను, పద్మ, ఏన్ఎం పద్మ పాల్గొన్నారు. కార్పొరేటర్ హిమశ్రీ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.