
జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు విడుదల
AP: రాష్ట్రంలో జూన్ నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమైంది. 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద రూ.2,728 కోట్లను విడుదల చేశారు. ఈసారి మొత్తం 62,34,445 మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా 5,606 మందికి స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నారు, దీనికోసం రూ.2.24 కోట్లు విడుదల చేశారు. మరణించిన లబ్ధిదారుల స్థానంలో కుటుంబ సభ్యులకు స్పౌజ్ పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్యను పెంచనున్నారు.




