సుజాతనగర్ పీహెచ్‌సీ పరిధిలో సాధారణ టీకాకరణ పరిశీలన

3చూసినవారు
సుజాతనగర్ పీహెచ్‌సీ పరిధిలో సాధారణ టీకాకరణ పరిశీలన
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి ఆదేశాల మేరకు, బుధవారం జిల్లా చైల్డ్ ఆరోగ్య, ఇమ్యునైజేషన్ అధికారి డా. ప్రతాప్ సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సింగభూపాలెం, పాత అంజనాపురం, సర్వారం ఆరోగ్య ఉప కేంద్రాలలో జరుగుతున్న సాధారణ టీకాకరణ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. టీకాకరణ సేవల అమలు, లబ్ధిదారుల హాజరు, వ్యాక్సిన్ నిల్వలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్