సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెంలో 'రన్ ఫర్ యూనిటీ' పేరుతో 2కె రన్ నిర్వహించారు. ఈ పరుగు రైల్వేస్టేషన్ నుండి అండర్ బ్రిడ్జ్, బస్టాండ్ సెంటర్ మీదుగా పోస్టాఫీస్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, పోలీస్ సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐక్యతను చాటే ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.