రేపు కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష

1137చూసినవారు
రేపు కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల బృందం సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనుంది. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఎస్సీ, ఎస్టీ భూములు, అట్రాసిటీ కేసులు, రోస్టర్‌ పాయింట్‌ అమలు, ఉద్యోగుల బ్యాక్‌లాగ్‌ ఖాళీలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. ఈ పర్యటనలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.

సంబంధిత పోస్ట్