సుజాతనగర్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు శనివారం తెలిపారు. సింగభూపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మంచినీళ్ల జెన్ని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని, కావాలనే కొందరు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాద్ధాంతాలు చేస్తున్నారని, అలాంటి వారు తమ పద్దతి మార్చుకోవాలని ఆయన సూచించారు.