పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగాపై సెమినార్ జరిగింది. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పోలారపు పద్మ మాట్లాడుతూ, నేటి జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవసరమని, విద్యార్థులు యోగాతో చదువుపై శ్రద్ధ పెంచి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. బెంగుళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు అరవింద్ గోయల్, పాల్వంచ యోగా గురు పట్టాభి రామారావు హాజరై, వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం లభిస్తుందని, జీవితంలో ఒత్తిడి లేకుండా జీవించవచ్చని తెలిపారు.