కార్మికుల హక్కుల సాధన లక్ష్యంగా సేవ్ సింగరేణి పోరు జాతాలో భాగంగా, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి జరిగింది. సింగరేణిలోని 11 ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ నాయకుడు కే. నారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై, ప్రధాన కార్యాలయం గేటు ఎదుట నిరసన తెలిపారు.